29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

నా కూతురును చంపింది నా భార్యే

Must read

📰 Generate e-Paper Clip

  • భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు

 

భీమ్ గల్, బతుకమ్మ : తాగుడికి బానిసన తన భార్య తన కూతురుని పట్టించుకుంటలేదని మందలిస్తే.. కూతురు కారణంగా భర్త మండలించాడని కన్న కూతురునే హతమార్చిన ఘటన మండలంలోని గోనుగొప్పుల గ్రామంలో విషాదాన్ని నింపింది. నిందితురాలి భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గోనుగొప్పులకు చెందిన గంగోని మల్లేష్ భార్య సిరసు రమ్య త్రాగుడికి బానిసై తమ ఐదునెల్ల కూతురు శివానిని పట్టించుకోవడం లేదని ఆదివారం మందలించి,రోజు వారి పని నిమిత్తం బయట వెళ్ళాడు. తన కూతురు కారణంగా తన భర్త తనను మందలించాడన్న కోపంతో అభం శుభం తెలియని ఐదునెల్ల కూతురునే పొట్టన పెట్టుకొంది. భర్త బైటకు వెళ్లిన అదును చూసి శివానిని హత్య చేసిందని హతురాలి భర్త మల్లేష్ స్థానిక పోలీసులు ఫిర్యాదు చేశారు. మల్లేష్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్ తెలిపారు.

More articles

Latest article