- ఏడు ట్రాక్టర్లు, ఒక ట్రాలీ సీజ్
పోతంగల్, బతుకమ్మ: మండలంలోని కోడిచర్ల మంజీరా శివారు ప్రాంతాల్లో నుండి రాత్రీ సమయాల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతుంది. కొందరు అక్రమార్కులు ట్రాక్టర్ల ద్వారా మహారాష్ట్ర, కర్ణాటక ఇతర ప్రాంతాలకు అక్రమంగా ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ ఇసుక రవాణా అరికట్టేందుకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇసుక మాఫియా దారులు తమకేమీలే అన్నచందంగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం రాత్రి సమయంలో కొడిచెర్ల శివారు నుండి మహారాష్ట్ర, మద్నూర్ కు సంబంధించిన కొంతమంది అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని, ఈ విషయం పై కొంతమంది స్థానికులు పై అధికారులకు సమాచారం అందించగా, స్పందించిన పోలీసు అధికారులు ఘటన స్థలానికి చేరుకుని ఏడు ట్రాక్టర్లు, ఒక ట్రాలీని పట్టుకుని పోలీసు స్టేషన్ తరలించి, సీజ్ చేశారు. ఇప్పటికైనా ఇసుక మాఫియా అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
