రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన తులసిరాం అను వ్యక్తి నిజామాబాద్ నుండి మూడు గంటల సమయంలో బోధన్ కు తిరుగు ప్రయాణంలో డైరీ ఫారం వద్ద గల నర్సాపల్లి నాలెడ్జ్ పార్క్ ఏరియాలో జేబులో నుండి 40,000 రూపాయల మొబైల్ పడిపోవడం జరిగింది. జీపు ఆపి మరి డ్రైవర్ శశిధర్ మళ్ళీ ఫోన్ చేసి మొబైల్ ని తిరిగి ఇచ్చారు. మహమ్మద్ ఫసియొద్దీన్ అనే వ్యక్తి మొబైల్ ఫోన్ తిరిగి అందజేసి ఆదర్శంగా నిలిచారు. దీంతో తులసిరాం మహమ్మద్ ఫసియొద్దీన్ కు కృతజ్ఞతలు తెలిపారు.
