బతుకమ్మ, బోధన్ : విద్యావికాస్ జూనియర్ కళాశాలలో మాదకద్రవ్యాల వినియోగం, ర్యాగింగ్, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు, రోడ్డు ప్రమాదాల నివారణకు అనుసరించాల్సిన ట్రాఫిక్ నియమాలు గురించి వివరంగా తెలిపారు. యువత తమ భవిష్యత్‌ను కాపాడుకునే దిశగా బాధ్యతాయుతంగా ఆలోచించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ శ్రీనివాస్, బోధన్ పోలీస్ స్టేషన్ ఎస్ఎచ్ఓ వెంకటనారాయణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

