24 C
Hyderabad
Sunday, August 2, 2026

శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను నెరవేర్చుదాం

Must read

📰 Generate e-Paper Clip

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

నిజామాబాద్, బతుకమ్మ : శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆశయ లక్ష్య సాధనకు ప్రతి కార్యకర్త పని చేయాలని, పార్టీని బలోపేతం చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్ పాల్ పాల్గొని మాట్లాడారు. అఖిల భారతీయ హిందూ మహాసభల అధ్యక్షుడిగా ముఖర్జీ సేవాలందించరన్నారు.  దేశ సమగ్రత, ఐక్యత కోసం హిందువులలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించడం ద్వారా జాతీయ పునరనిర్మాణం జరుగుతుందనే లక్ష్యంతో జనసంఘ్ ను ముఖర్జీ  స్థాపించడని అన్నారు. ఆర్టికల్ 370ని ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారని పేర్కొన్నారు. ఒకే దేశానికి రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానులు మరియు రెండు జాతీయ చిహ్నలు ఉండకూడదని ముఖర్జీ అన్నారని గుర్తు చేశారు. దేశ భద్రత, సమగ్రత, అభివృద్ధి లక్యంగా ముఖర్జీని ఆదర్శంగా తీసుకొని కేంద్రప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఆ మహనీయుని త్యాగానికి గుర్తుగా బలిదాన్ దివస్ జరుపుకుంటున్నామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ప్రధానకార్యదర్శులు న్యాలం రాజు, పోతంకర్ లక్ష్మీనారాయణ, మల్లేష్ యాదవ్,బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్నాటి కార్తీక్, కస్తూరి కృష్ణ, నారాయణ యాదవ్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article