శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను నెరవేర్చుదాం
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ నిజామాబాద్, బతుకమ్మ : శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆశయ లక్ష్య సాధనకు ప్రతి కార్యకర్త పని చేయాలని, పార్టీని బలోపేతం చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్ పాల్ పాల్గొని మాట్లాడారు. అఖిల భారతీయ హిందూ మహాసభల అధ్యక్షుడిగా ముఖర్జీ సేవాలందించరన్నారు. దేశ సమగ్రత, ఐక్యత కోసం హిందువులలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించడం ద్వారా జాతీయ పునరనిర్మాణం...