- నందిపేట్ యువకుల తీర్థయాత్ర
నందిపేట్, బతుకమ్మ : నందిపేట్ గ్రామానికి చెందిన యువకులు ఎ. దేవీదాస్, చింత నవనీత్‌లు ద్విచక్రవాహనంపై విస్తృత తీర్థయాత్రకు పయనమయ్యారు. గత సోమవారం నందిపేట్ నుంచి బస్కోడా వరకు 630 కిలోమీటర్లు, రెండో రోజు బృందావన్ వరకు 625 కిలోమీటర్లు దూరం ప్రయాణించారు. మూడో రోజు బృందావన్‌లో శ్రీకృష్ణకు సంబంధించిన 6 ప్రధాన ఆలయాలు, 4 ధామ్‌లను దర్శించి, సాయంత్రం మోరాదాబాద్ చేరుకుని విశ్రాంతి తీసుకున్నారు. నాల్గో రోజు హరిద్వార్‌లో గంగా హారతి, రిషికేశ్‌లో త్రివేణీ సంగమాన్ని దర్శించి రాత్రికి నౌగాన్ చేరారు. సోమవారం నుంచి శనివారం వరకు 340 కిలోమీటర్లు ప్రయాణించి గంగోత్రి చేరుకుని గది ఏర్పాటు చేసుకున్నారు. ఈ పుణ్యయాత్రలో ప్రతి రోజు ఒకసారే భోజనం, ఒకసారే తిఫిన్ తో సరిపెట్టుకుంటూ, ప్రతి దశలో కొత్త అనుభూతులను ఆస్వాదిస్తూ ఆత్మానందంగా ముందుకు సాగుతున్నారు.
