29 C
Hyderabad
Monday, August 3, 2026

బీఆర్ఎస్ లో చేరిన మహమ్మద్ ఇక్రం

Must read

📰 Generate e-Paper Clip

  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

 

భీమ్ గల్, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం అవ్వడం,రేవంత్ రెడ్డి పరిపాలన తీరు నచ్చక పోవడంతో  భీమ్ గల్ మండల కేంద్రానికి చెందిన మైనారిటీ నాయకుడు మహ్మద్ ఇక్రం బీయర్ యస్ పార్టీలో చేరారు. శుక్రవారం ఆయన  హైదరాబాద్ లోని మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తన నివాసంలో ఇక్రమ్ కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.గతం లో బీయర్ యస్ పార్టీ పని చేసిన ఇక్రమ్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం జరిగింది. ఆ పార్టీ సిద్ధాంతాలు, పరిపాలన వ్యవహారం నచ్చక తిరిగి సొంత గూటికి చేరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దోన్కంటి నర్సయ్య,మాజీ జెడ్పిటిసి రవి,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ భగత్,బాబాపూర్ మాజీ ఎంపిటిసి సుర్జీల్,రహమాన్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article