నిర్మాణంలో ఉన్న ఇల్లు కబ్జా అని కూల్చివేసేందుకు అధికారుల యత్నం
మల్కాపూర్ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత
ఎల్లారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోని పెద్దోళ్ల నర్సిలు అనే వ్యక్తి నిర్మిస్తున్న నూతన ఇంటి భవనం 6 పిట్ల రహదారి లో ఉన్నాదని, దానికి కూల్చాడానికి పోలీస్ బందోబస్త్ ల మధ్య కొలతలు తీసుకొని కూల్చడానికి అధికారులు సిద్ధం కావడంతో ఉద్రికత నెలకొంది. శుక్రవారం ఉదయం ఎంపీవో ప్రకాష్, గ్రామపంచాయతీ సెక్రటరీ ప్రదీప్, అధికారులు ఇంటి నిర్మాణాన్ని కూల్చడానికి సిద్ధమయ్యారు. దాంతో బాధిత కుటుంబ సభ్యుల పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేశారు. అక్కడ బందోబస్తు నిమిత్తం వచ్చిన పోలీసులు ముగ్గురి ఆత్మహత్యయత్నాన్ని అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాజకీయ కక్షల కారణంగా ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అధికారులు మాత్రం నియమ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తున్నామని తెలుపడం గమనార్హం.

