26.2 C
Hyderabad
Monday, August 3, 2026

నవ్యభారతి గ్లోబల్ పాఠశాలలో విద్యార్థుల పార్లమెంటరీ ఎన్నికలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్  సిటీ, బతుకమ్మ: నగరం లోని నవ్యభారతి గ్లోబల్ పాఠశాలలో బుధవారం  విద్యార్థుల పార్లమెంటరీ ఎలక్షన్స్ ఘనంగా ప్రజాస్వామ్య విలువలతో నిర్వహించబడ్డాయి. హెడ్ బాయ్ , హెడ్ గర్ల్, స్పోర్ట్స్ కెప్టెన్, ఎకో హెల్త్ కల్చరల్ పదవుల కోసం మొత్తం 14 మంది విద్యార్థులు పోటీలో పాల్గొన్నారు. తమ సామర్థ్యాన్ని, నాయకత్వ గుణాలను ప్రదర్శించేందుకు విద్యార్థులు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ కె. సంతోష్ కుమార్ , కరస్పాండెంట్ కే శ్రీదేవి లు మాట్లాడుతూ, “ఈ రకమైన ఎన్నికలు విద్యార్థులలో ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ లక్షణాలు , బాధ్యత గల పౌరునిగా ఎదగాలనే లక్ష్యాన్ని నూరిపోస్తాయని అన్నారు. విద్యార్థుల ఉత్సాహం చూస్తే భవిష్యత్తులో దేశానికి మంచి నాయకులు సిద్ధమవుతారనే నమ్మకం కలుగుతోంది,” అని తెలిపారు. ఎన్నికలు పూర్తి పారదర్శకంగా నిర్వహించబడ్డాయి. విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ మంచి భాగస్వామ్యాన్ని చూపించారు. త్వరలో ఫలితాలు ప్రకటించబడతాయని తెలిపారు. అనంతరం తమ ఓటు హక్కులను వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఆంటోనీ, హెచ్ఆర్ టి. లత, ఐటి వైస్ ప్రిన్సిపాల్ సుధీర్ ,వైస్ ప్రిన్సిపల్ సరిత ఎలక్షన్ కమిషనర్లుగా కె జానకి కర్నె ప్రతిమ , ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article