25.5 C
Hyderabad

కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూమి

Must read

📰 Generate e-Paper Clip

  • ప్రభుత్వ భూమిని కాపాడి చెరువుకి రక్షణ కల్పించాలి

 

రుద్రూర్, బతుకమ్మ : కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూమిని కాపాడి చెరువుకి రక్షణ కల్పించాలని రుద్రూర్ మండలం చిక్కడపల్లి గ్రామస్తులు గురువారం  తహసిల్దార్ తారాబాయికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. చిక్కడపల్లి శివారులోని సర్వే నెంబర్ 202/ఇ లోని 0.20 గుంటల భూమిని వ్యక్తి కబ్జా చేసి పట్ట చేసుకోవాలని  ప్రయత్నిస్తున్నారని, అట్టి ప్రయత్నాలను రద్దు చేయాలన్నారు. గతంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగాయని అప్పట్లో బోధన్ సబ్ కలెక్టర్ కి ఫిర్యాదు చేయగా, సబ్ కలెక్టర్ స్వయంగా వచ్చి దర్యాప్తు చేసి అట్టి భూమి చెరువుకు రక్షణగా ఉపయోగపడే భూమి అని, ఈ భూమి కబ్జా గాని, పట్టా గాని చేయడానికి ఆస్కారం లేదని తేల్చి చెప్పినట్టు గ్రామస్తులు తెలియజేశారు. తాహాసిల్దార్ కి ఫిర్యాదు చేసిన వారిలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు కుర్మా రాజు, కర్రోళ్ల రాజయ్య, నక్క గంగాధర్, జెల్ల పరమేష్, కుర్మా మల్లయ్య  ఉన్నారు.

More articles

Latest article