కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూమి

ప్రభుత్వ భూమిని కాపాడి చెరువుకి రక్షణ కల్పించాలి   రుద్రూర్, బతుకమ్మ : కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూమిని కాపాడి చెరువుకి రక్షణ కల్పించాలని రుద్రూర్ మండలం చిక్కడపల్లి గ్రామస్తులు గురువారం  తహసిల్దార్ తారాబాయికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. చిక్కడపల్లి శివారులోని సర్వే నెంబర్ 202/ఇ లోని 0.20 గుంటల భూమిని వ్యక్తి కబ్జా చేసి పట్ట చేసుకోవాలని  ప్రయత్నిస్తున్నారని, అట్టి ప్రయత్నాలను రద్దు చేయాలన్నారు. గతంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగాయని అప్పట్లో బోధన్ సబ్ కలెక్టర్...