26.3 C
Hyderabad
Monday, August 3, 2026

లేబర్ కోడ్ లు రద్దు చేసే వరకు పోరాటం

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ లు రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని, జూలై 9న కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులు పాల్గొననున్నట్లు గ్రామపంచాయతీ కార్మికులు బుధవారం రుద్రూర్ ఎంపీడీఓ భీమ్ రావుకు సమ్మె నోటీసు అందజేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్ లు తెచ్చి, కార్మికులను కష్టాలపాలు చేస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకుడు నన్నేసాబ్  యూనియన్ మండలాధ్యక్షుడు అశోక్, కార్మికులు సురేష్, సాయిలు, గంగారం తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article