కామారెడ్డి, బతుకమ్మ : జహీరాబాద్ పార్లమెంట్ ఇన్చార్జిగా ఇటీవల నియామకమైన ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా కామారెడ్డి పర్యటన కు వచ్చిన సందర్భంగా కల్కి మానవ సేవా సమితి, కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) ల సంయుక్త ఆధ్వర్యంలో సన్మానించినట్లు ఐ వి ఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను ఆకాంక్షించాలని, ఆర్యవైశ్యుల అభివృద్ధికి తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆలయానికి విచ్చేసిన పిసిసి జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావును సన్మానించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ గంప ప్రసాద్, ఆలయ సేవకులు ఎర్రం విజయ్, ఎర్రం సూర్యకాంతం, నాయకులు గోనె శ్రీనివాస్, కిరణ్, సర్వర్ లు పాల్గొన్నారు.
