భీమ్ గల్, బతుకమ్మ : జిల్లా కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి వచ్చిన రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్కను భీమ్ గల్ కాంగ్రెస్ మండల నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం మండల పార్టీ ప్రెసిడెంట్ బోదిరే స్వామి ఆధ్వర్యంలో మంత్రిని పూల బొకే ఇచ్చి శాలువతో సన్మానించారు. మంత్రిని కలిసిన వారిలో మాజీ ఎంపీపీ కన్నె సురేందర్,పట్టణ అధ్యక్షులు జె జె నర్సయ్య, మండల పార్టీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ పర్స అనంత్ రావు,డీసీసీ డెలికెట్ కుంట రమేష్, బడా భీమ్ గల్ నాయకులు దాకటి స్వామి, రావుల మోహన్ తదితరులు ఉన్నారు.
