27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

భీంగల్ కు కోర్టు మంజూరు హర్షనీయం

Must read

📰 Generate e-Paper Clip

  • సీఎం, పీసీసీ చీఫ్ ల చిత్రపటాలకు పాలాభిషేకం

 

భీంగల్, బతుకమ్మ : భీమ్ గల్ పట్టణానికి ప్రభుత్వం కోర్టు ను మంజూరు చేయడం హర్షనీయమని కాంగ్రెస్ నాయకులు అన్నారు. కోర్ట్ మంజూరి సందర్బంగా పట్టణ కాంగ్రెస్ నాయకులు సీ. ఏం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ల చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ హైకోర్టు విజ్ఞప్తి మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 9 నూతన కోర్టులు  మంజూరి ఇచ్చిందని అందులో భీమ్ గల్ కు నూతన కోర్టు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. పిసిసి ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్  భీమ్ గల్ మండలం పిప్రి గ్రామంలో శ్రీ లొద్ది రామన్న జాతరైన శ్రీరామనవమి  రాములవారి కళ్యాణానికి వచ్చిన సందర్భంగా భీమ్ గల్ కు కోర్టు అవసరం ఉంది చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉందని విన్నవించడం జరిగిందన్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడి ప్రజలకు కోర్టు అవసరముందని  స్థానిక నాయకులకు వివరించిన పట్టించుకోలేదని మీరు ఈ ప్రాంత వాసిగా ఇక్కడ కోర్టు మంజూరు చేయించాలని కోరడం జరిగిందన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వగావెంటనే స్పందించిన పీసీసీ చీఫ్ లా సెక్రటరీ తో మాట్లాడి భీమ్ గల్ కు కోర్టు వెంటనే మంజూరు చేయాలని ఫోన్లో మాట్లాడి చెప్పారన్నారు. కోర్టు మంజూరు కి కృషిచేసిన పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్,బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్,తెలంగాణ రాష్ట్ర మినరల్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్,తెలంగాణ రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి,తెలంగాణ రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డిలకు, హైకోర్టు జడ్జి,జిల్లా కోర్టు జడ్జి,న్యాయవాదులకు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున, మండల ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు,జెజె నరసయ్య,జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు అనంతరావు,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు గోపాల్ నాయక్,బీసీ సెల్ మండల అధ్యక్షులు కొరాడి రాజు, మాజీ ఎంపీపీ మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత సురేందర్,మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లెల రాజశ్రీ లక్ష్మణ్, ముచ్కూర్ సొసైటీ చైర్మన్ బంగ్లా దేవేందర్,భీంగల్ సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షులు నీలం రవి,మోహన్,కొరాడి లింబాద్రి,సుంకరి సురేష్,జేమ్స్,శ్రీను,దినేష్,సేవాలాల్,షాదుల్లా,నవీద్,ధనుష్,జుబేర్,సిఎచ్ గంగాధర్,అజ్మతుల్లా,అంజుమ్,రాము,మురారి,శివ,రాజారెడ్డి, దావూద్,రాజన్న,న్యాయవాదులు చైతన్య,సురేష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article