ముప్కాల్, బతుకమ్మ: ముప్కాల్ మండలం బీ ఆర్ ఎస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బద్దం నర్సారెడ్డి ఆదివారం బాల్కొండ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కలిశారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన అధ్యక్షునికి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు నర్సారెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలపై పోరాడతానని, ప్రతి ఒక్కరిని సమన్వయపరుస్తూ అందరికీ అందుబాటులో ఉంటానని తెలియజేశారు.
