27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

అమిత్ షా సభను విజయవంతం చెయ్యాలి

Must read

📰 Generate e-Paper Clip

  • బీజేపీ మండల పార్టీ ప్రెసిడెంట్ అరే రవీందర్

 

భీంగల్, బతుకమ్మ : పసుపు బోర్డు కార్యాలయ ప్రారంబానికి విచేస్తున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సభను విజయవంతం చేయాలని బీజేపీ మండల పార్టీ ప్రెసిడెంట్ అరే రవీందర్ కోరారు.శనివారం మండలంలోని బాబాపూర్ గ్రామ శాఖ నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ నెల 29 న కేంద్ర జిల్లా కేంద్రం లోని పాలిటెక్నిక్ గ్రౌండ్ లో నిర్వహించే రైతు మహా సమ్మేళనానికి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ సభకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు రైతులు భారీగా తరలించాలని ఆయన కోరారు. బీజేపీ బాల్కొండ కానిస్టెన్సీ ఇంచార్జ్ డాక్టర్. మల్లికార్జున్ రెడ్డి ఆదేశానుసారం మండల మైనార్టీ ప్రెసిడెంట్ గా హకీమ్ ను నియమిస్తూ, నియామక పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి బిర్రు రామకృష్ణ,శక్తి కేంద్ర ప్రముఖ్ అన్వేష్, బీజేవైఎం నాయకులు నవ తేజ్,బూత్ అధ్యక్షులు దేవేందర్, హకీం భాయ్,రాకేష్,దేవా,నరేష్ గ్రామ యువ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article