26.6 C
Hyderabad
Monday, August 3, 2026

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఏర్గట్ల: మండలం బట్టపూర్ గ్రామంలో శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆకుల రవి లబ్ది దారులతో కలిసి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనా ప్రతి ఒక్కరు తొందరగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బాలే శ్రీనివాస్, బత్తుల సంజీవ్, మూడ్ రాజు నాయక్,ఫీల్డ్ అసిస్టెంట్ కొండ రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు,పాల్గొన్నారు.

More articles

Latest article