27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

నల్ల చట్టాలను దొంగచాటున తెచ్చే ప్రయత్నాలు

Must read

📰 Generate e-Paper Clip

  • ఏఐయుకెఎస్ స్టేట్ సెక్రటరీ దేవరాం

 

కమ్మర్ పల్లి, బతుకమ్మ : కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం మళ్ళా దొంగచాటున నల్లచెట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం ను కొనసాగిస్తున్నారని, ఆధాని, అంబాని లాంటి కార్పొరేట్ శక్తులకు వ్యవసాయరంగాన్ని అమ్మేయాలని చూస్తున్నారని అఖిల భారత ఐక్య రైతు సంఘం(ఏ ఐ యు కె యస్)స్టేట్ సెక్రటరీ దేవరాం ఆరోపించారు. గురువారం కమ్మర్ పల్లి మండలం లోని హాసకొత్తూరు లో నిర్వహించిన ఏ ఐ యు కె యస్  కమ్మర్ పల్లి ఏరియా ప్రథమ మహా సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.ముందుగా ఏ ఐ యు కె యస్ ఏరియా ప్రెసిడెంట్ ఉట్నూర్ బాలయ్య జెండాను ఆవిష్కరించి అమరవీరులకు నివాళులార్పించారు. ఈ సందర్బంగా దేవరాం మాట్లాడుతూ కేంద్రం గతంలోనే నల్లచట్టాలు తెచ్చి వ్యతిరేకించిన రైతులను దాడి చేసి కొట్టి తిరిగి క్షేమపణ చెప్పి నిర్ణయాన్ని వెనక్కి తీసుకొన్న మోడీ మళ్ళీ నల్ల చట్టాలను దొంగచాటున అమలు చేసేందుకు చూస్తోందని  అన్నారు. రైతుల కోసం, రైతు కూలీల కోసం వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి దశాబ్దాలుగా ఎర్రజెండా పోరాటాన్ని కొనసాగిస్తుం దని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు.భూమికోసం భుక్తి కోసం పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసం దున్నేవాడిదే భూమి అనే నినాదాన్ని వెలుగెత్తి సాటి అమరులైన వీరులను స్మరించుకోవాలన్నారు.  ఢిల్లీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను మనం సంఘటితంగా కలిసి పోరాటం చేయాలని, అఖిలభారత ఐక్య రైతు సంఘం తో కలిసి రైతులందరూ ఉద్యమాల వైపు తన హక్కులను కాపాడుకునే దిశగా నడవాలని,పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసం కొట్లాడి ప్రకటించే వరకు పోరాటం చేయాలన్నారు.కౌలు రైతుల భవిష్యత్తు కోసం ఉద్యమించాలని నకిలీ  విత్తనాలపై చర్య తీసుకోవాలని.రైతాంగానికి పిలుపునిచ్చారు.స్వామినాథన్ సిఫారాసులని అమలు చేయాలని,రైతు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది ఏరియా అధ్యక్షులుగా ఉట్నూర్  బాలయ్య,ప్రధాన కార్యదర్శిగా తోపారం బాలకిషన్ ల ను ఎన్నుకొన్నారు. ఈ కార్యక్రమం లో డాక్టర్ సత్యనారాయణ, జి కిషన్ సిపిఎంఎల్ మాస్ లైన కమ్మర్పల్లి మండల కార్యదర్శి బి అశోక్, అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి కిషన్, ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి సత్య అక్క, వి అశోక్, పెద్ది రాజేశ్వర్, ముత్తన్న, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article