. . . ఆర్టిఏ చెక్ పోస్టులో నగధు స్వాధినం
మద్నూర్, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లాలోని అంతర్ రాష్ట్ర సరిహద్ధు లోని సలబత్ పూర్ రవాణా శాఖ చెక్ పోస్టుపై ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. బుదవారం అర్ధరాత్రి నిజామాబాద్ రెంజ్ ఎసిబి డిఎస్పీ శేఖర్ అధ్వర్యంలో మద్నూర్ మండలంలోని సలబత్ పూర్ చెక్ పోస్టులో తనిఖీలు చేపట్టారు. ఈ సంధర్బంగా రాత్రి విధులలో ఎఏంవిఐ కవితతో పాటు రవాణా శాఖ సిబ్బంది, ఇద్ధరు ప్రైవేట్ వ్యక్తులు ఉన్నప్పుడు ఈ సోదాలు నిర్వహించారు. రాత్రి వేళ జాతీయ రహదారిపై ఉన్న చెక్ పోస్టులో వాహనాల తనిఖీల పేరిట డబ్బుల వసూళ్ల కార్యక్రమం జరుగుతున్నట్టు గుర్తించారు. చెక్ పోస్టులో రవాణాశాఖ కు సంబందించిన లెక్కలకు మించి నగధు ఉన్నట్టు గుర్తించారు. ఈ ఎడాదిలో రెండోసారి ఎసిబి ఆకస్మీక తనిఖీలు చేయడం. గతంలోను నగధు దోరికిన అనాడు విధులు నిర్వహిస్తున్నవారిపై శాఖపరమైన చర్యలు లేకపోవడంతోనే ఆక్రమ వసూళ్లు అగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
