33.1 C
Hyderabad

మత్తు మందు ఇచ్చి గోవులను దొంగలించే యత్నం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని న్యాల్కల్ రోడ్డులోని గోవులకు మత్తుమందు ఇచ్చి దొంగిలించే ప్రయత్నం చేశారని గో సేవకులు నాలుగో టౌన్ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. కొందరు దుండగులు ఇన్నోవా కార్లో గోవులను దొంగిలించే ప్రయత్నం చేశారని అన్నారు. అది గమనించిన గో సేవకులు అప్రమత్తమై వారిని వెంబడించారని తెలిపారు. దుండగులు ఆర్ఆర్ చౌరస్తా నుండి గాంధీ చౌక్ మీదుగా తప్పించుకుని వెళ్లాలని అన్నారు. దుండగులను తక్షనమే పట్టుకొని చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా సహా కార్యదర్శి దాత్రిక రమేష్, గోసేవకులు గాజిరెడ్డి, హరీష్ రెడ్డి, అంత రెడ్డి సంపత్, సాయి వర్ధన్, మణికంఠ, ట్రింకు పాల్గొన్నారు.

More articles

Latest article