29 C
Hyderabad
Monday, August 3, 2026

ఐపీఎల్, పీకేఎల్ తరహాలో బాస్కెట్ బాల్ టోర్నమెంట్

Must read

📰 Generate e-Paper Clip

  • తెలంగాణ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రావుల శ్రీధర్ రెడ్డి

 

హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణలో మొదటి సారిగా ఐపీఎల్, పీకేఎల్ తరహాలో బాస్కెట్ బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రావుల శ్రీధర్ రెడ్డి తెలిపారు. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం వేదికగా జూలై 3 నుండి ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుందని తెలిపారు. రాష్ట్రంలోని పలు నగరాల నుంచి మొత్తం 6 టీమ్స్ ఈ టోర్నమెంట్లో పోటీ పడనున్నాయని పేర్కొన్నారు. రంగారెడ్డి నుండి “రంగారెడ్డి రైనోస్”, మహబూబ్నగర్ నుండి “మహబూబ్ నగర్ బుల్స్”, నిజామాబాద్ నుండి “నిజామాబాద్ నవాబ్స్ “, కరీంనగర్ నుండి “కరీంనగర్ కింగ్స్”, హైదరాబాద్ నుండి “హైదరాబాద్ హాక్స్”,వరంగల్ నుండి “వరంగల్ వారియర్స్” పాల్గొనబోతున్నట్లు తెలిపారు. బాస్కెట్బాల్ ఆటని డెవలప్ చేస్తూ యువతలో ఉన్న టాలెంట్ ని ముందుకు తీసుకురావడానికి ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మాల్దీవ్స్ వేదికగా బాస్కెట్ బాల్ సభ(SABA) ఛాంపియన్షిప్ లో తెలంగాణ నుండి భారత దేశానికి ప్రాతినిధ్యం వహించిన నేత్ర , శాన్వి , విహా రెడ్డి అనే ముగ్గురు అమ్మాయిలను తెలంగాణ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రావుల శ్రీధర్ రెడ్డి సన్మానించారు.

More articles

Latest article