24.7 C
Hyderabad
Monday, August 3, 2026

సామవేదం తోనే విశ్వ శాంతి, మనః శాంతి చేకూరుతుంది.

Must read

📰 Generate e-Paper Clip

  • శ్రీ శ్రీధరానంద భారతీ స్వామి

 

ఆర్మూర్, బతుకమ్మ : నాలుగు వేదాలాల్లో సామ వేదం అత్యంత ప్రధానమయిందని ఈ సామ వేద పారాయణంతో సర్వ విశ్వశాంతి, మనవాలికి మనఃశాంతి చేకూరుతుందని వైధిక ధ్యాన యోగాశ్రమ వ్యవస్థపాకులు, వైధిక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీశ్రీధరానంద భారతీ స్వామి వారు ఉద్బోదించారు. మంగళవారం మండలంలోని ఆంకాపూర్ గ్రామ శివారులోని వైధిక ధ్యాన యోగశ్రమంలో లోకాకళ్యాణర్థం, విశ్వశాంతి కోసం సామ వేద పారాయణ మహా యజ్ఞాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా స్వామీజీ ప్రసంగిస్తూ
4 వేదాల్లో రస ప్రధానమైన వేదం సామవేదమని, ఈ సామవేదము పరమాత్మ గుణ,గాన సంబంధమైనధన్నారు. సామవేదం నుండే సంగీతం విస్తరించిందని,భగవంతుని భక్తికి నిలయం కావాల్సిన సంగీతం అశ్లీల వర్ణనలకు ఆలవాలమైనదని ఆవేదన వ్యక్తం చేశారు. మహర్షులు నిర్మల హృదయంతో సామగానం చేసి ప్రకృతిని అదుపులో పెట్టేవారని,తద్వారా సకాలంలో వర్షాలు కురిసేవని, క్రూర జంతువులు సైతం కలిసి మెలిసి జీవించ్చేటట్లు చేసేవారన్నారు. సామగానంతో ఆనంద పరవశులను చేసేవారని, అటువంటి సంగీతము కలుషితమై ఈనాడు కేవలం రికార్డు డ్యాన్సులకు పరిమితమైందని స్వామి వాపోయారు. కాబట్టి మళ్లీ మనం భారతీయ పరంపరైన సామవేదాన్ని అధ్యయనం చేసి మనశ్శాంతిని, విశ్వశాంతిని పొందాలని భక్త శయులను స్వామి కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ వేద పూనీతానంద స్వామీజీ,కవి కంకణాల రాజేశ్వర్,
మందం లక్ష్మీ భూమేశ్వర్, నడిపి గంగ సాయన్న దంపతులు, ఈశ్వర సాయి దంపతులు, కనికరం మధు దంపతులు, బద్దం రాజు భాయి నర్సారెడ్డి, కొమ్ముల ఎల్ఐసి గంగారెడ్డి దంపతులు, కొక్కు ప్రసాద్ దంపతులు, పిట్టల సందీప్, ఆశ్రమ సేవకురాలు లక్ష్మి లతో పాటు నిజామాబాద్, నిర్మల్, ఆర్మూర్, అంకాపూర్ తదితర గ్రామాల భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article