25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

భీమ్ గల్ మున్సిపాలిటీలో అవినీతి ఆరోపణలు

Must read

📰 Generate e-Paper Clip

  • నకీలి బిల్లు పెట్టి నిధులు స్వాహా చేసిన ప్రజా ప్రతినిధులు
  • అధిధికారులు, ప్రజా ప్రతినిధులు కుమ్ముకై నిధుల దుర్వినియోగం

 

భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ పట్టణ  మున్సిపాలిటీ పరిపాలనలో భారీ అవినీతి బాగోతం చోటుచేసుకుందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పట్టణ ప్రెసిడెంట్ కనికరం మధు  తీవ్ర ఆరోపణలు చేశారు. మున్సిపల్ లో జరిగిన నిధుల స్వాహాః పై మంగళవారం పట్టణంలోని ఎల్ జే ఫంక్షన్ హాల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ పరిపాలనకు సంబంధించి 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాలలో పనులకు  సంబంధించిన బిల్లులను సమాచార హక్కు చట్టం (ఆర్ టి ఐ) ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా ఈ అవినీతిని తాము బహిర్గతం చేస్తున్నామని అన్నారు. నిధులు మంజూరైనా, కొన్ని పనులు పూర్తిగా చేయకపోయినా వాటిని పూర్తయినట్లుగా చూపించి నకిలీ బిల్లులు తయారు చేసి పెట్టారని అన్నారు. ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, పలువురు కౌన్సిలర్లు, కాంట్రాక్టర్లు,ఆడిటర్లు కలిసి ఈ అవినీతికి పాల్పడినట్లు తేలిందని తెలిపారు.ప్రజాప్రతినిధుల అవినీతి బాగోతానికి అధికారులు వత్తాసు పలికారన్నారు. పన్నుల రూపంలో ప్రజల శ్రమ ఫలితంగా ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను దోచుకుని మున్సిపల్ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని పొగట్టారని, ఇది కేవలం నిర్లక్ష్యం కాదని,ఇది పక్కా పథకం ప్రకారం జరిగిన ప్రజాధన దోపిడి,” అని ఆయన అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్, లోకాయుక్త అధికారులతో వెంటనే విచారణ జరిపించి,బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలు ఈ అవినీతి పై గళం విప్పాలని, భవిష్యత్‌లో ఇలాంటి దుస్థితులు తలెత్తకుండా ప్రజా అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.అలాగే కొంత మంది రాజకీయ నాయకులు కాంట్రాక్టర్ లు గా మరి ఈ వ్యవస్థ ని దుర్వినియోగం చేయడం లో ముఖ్య పాత్ర పోషించినట్లు కనిపిస్తుందని ఆరోపించారు. దీనిపై జిల్లా కలెక్టర్ భీమ్ గల్ మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ సమగ్ర విచారణ జరిపించి అవినీతి చేసిన వారిపై కఠిన చర్య తీసుకోకపోతె పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చెపడతామని ఆయన హెచ్చరించారు.ఈ ప్రెస్ మీట్ లో కార్యక్రమంలో బీజేపీ  జిల్లా కౌన్సిలర్ మెంబర్ యోగేశ్వర నరసయ్య, బిజెపి సీనియర్ నాయకులు బండారు లక్ష్మణ్ గౌడ్, సంధ్యా రాజు తదితర నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article