26.6 C
Hyderabad
Monday, August 3, 2026

పార్టీలో బాధ్యతలు నిర్వహిస్తే పదవులు వచ్చి తీరుతాయి

Must read

📰 Generate e-Paper Clip

  • సీఎం రేవంత్ రెడ్డి

 

హైదరాబాద్, బతుకమ్మ : పార్టీలో బాధ్యతలు నిర్వహిస్తే పదవులు వచ్చి తీరుతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.  హైదరాబాద్ లో మంగళవారం నిర్వహించిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ‘‘కార్యకర్త స్థాయి నుంచి అనేకమంది ముఖ్యమంత్రులుగా,మంత్రులుగా,పీసీసీ అధ్యక్షులుగా ఎదిగారు. పార్టీలో బాధ్యతలు నిర్వహిస్తే పదవులు వచ్చి తీరుతాయి. నాకు కాంగ్రెస్ పార్టీ భాద్యతల తోనే ముఖ్యమంత్రి పదవి దక్కింది. పార్టీ బాధ్యతలు మోసిన 65 మందికి ప్రభుత్వంలో పదవులు ఇచ్చాం. పార్టీ పదవులు వచ్చాయని పనిచేయక పోతే వారి ని పీసీసీ అధ్యక్షుడు పక్కన పెడతారు. కార్యకర్తల ఎన్నికలు రాబోతున్నాయి…స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకోవాలి. మళ్లీ కాంగ్రెస్ అధికారం లోకి తీసుకురావలసిన బాధ్యత మీదే. పార్టీ నిర్మాణం లో మీరు బాధ్యత తీసుకోవాలి. అధికారం వచ్చిన సంవత్సరంలో 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. 18 నెలల్లో రైతుల కోసం లక్షా నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టాం. దేశం లో ఏ ప్రభుత్వం రైతుల కోసం ఇంత ఖర్చు చేయలేదు. విద్యార్థులకు 200 శాతం కాస్మెటిక్ చార్జీలు,40 శాతం డైట్ చార్జీలు పెంచాం. 100 ఏళ్ల కులగణన కలను నెరవేర్చాం. కులగణన చేసి మోడీ ప్రభుత్వానికి సవాల్ విసిరాం. కేంద్రం మెడలు వంచి దేశం లో కులగణన చేపట్టాలని నిర్వహించేలా చేశాం. ఎస్సీ వర్గీకరణ కోసం 35 ఏళ్ళ నుంచి పోరాటం చేశారు..అనేక మంది త్యాగాలు చేశారు. ఎస్సీ వర్గీకరణ చేసి సమస్యకు పరిష్కారం చూపించాం. పెట్టుబడుల కోసం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను తీసుకొచ్చాం. పార్టీ నిర్మాణం లో క్రియాశీలక పాత్ర పోషించాలి. పార్టీ పదవి అని చిన్న చూపు చూడొద్దు..రేపు గొప్ప అవకాశాలు ఇచ్చేది పార్టీ పదవులే. 2029 లో పార్టీ 2 వ సారి అధికారం లోకి వస్తే పదవులన్నీ మీకే వస్తాయి. పార్టీ నాయకులు ప్రజలకు దగ్గరగా ఉండాలి. 18 నెలల మన పాలన గోల్డెన్ పీరియడ్..ప్రజలలోకి తీసుకుపోవాలి. ప్రజలకు,ప్రభుత్వానికి మధ్య అనుసంధానం గా నాయకులు ఉండాలి. 10 ఏళ్ల బీఆర్ ఎస్ పాలనకు,18 నెలల కాంగ్రెస్ పాలన పైన బహిరంగ చర్చకు సవాల్ చేయాలి. 18 నెలల్లో మన ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు చెప్పాలి’’ అని అన్నారు.

 

If you carry out responsibilities in the party, positions will come and go.

More articles

Latest article