పార్టీలో బాధ్యతలు నిర్వహిస్తే పదవులు వచ్చి తీరుతాయి

సీఎం రేవంత్ రెడ్డి   హైదరాబాద్, బతుకమ్మ : పార్టీలో బాధ్యతలు నిర్వహిస్తే పదవులు వచ్చి తీరుతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.  హైదరాబాద్ లో మంగళవారం నిర్వహించిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ‘‘కార్యకర్త స్థాయి నుంచి అనేకమంది ముఖ్యమంత్రులుగా,మంత్రులుగా,పీసీసీ అధ్యక్షులుగా ఎదిగారు. పార్టీలో బాధ్యతలు నిర్వహిస్తే పదవులు వచ్చి తీరుతాయి. నాకు కాంగ్రెస్ పార్టీ భాద్యతల తోనే ముఖ్యమంత్రి పదవి దక్కింది. పార్టీ బాధ్యతలు మోసిన 65 మందికి ప్రభుత్వంలో పదవులు ఇచ్చాం. పార్టీ పదవులు వచ్చాయని...