27.4 C
Hyderabad

విశ్వవిద్యాలయంలో ఒలంపిక్స్ డే రన్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : ప్రపంచ ఒలింపిక్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని  ఒలంపిక్స్ రన్   అర్ట్స్ అండ్  సైన్స్ కళాశాల నుండి  ప్రారంభమై యూనివర్సిటీ ప్లేగ్రౌండ్ వరకు కొనసాగించామని  డైరెక్టర్ స్పోర్ట్స్ డాక్టర్ జి. బాలకిషన్ తెలిపారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్  ప్రో. రవీందర్ రెడ్డి హాజరయ్యారు.  ఈ సందర్భంగా ప్రిన్సిపల్  డా.  ప్రవీణ్ మామిడల  మాట్లాడుతూ  ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఈవెంట్ ఒలంపిక్స్ అని అలాంటి  ఒలంపిక్స్ రన్  తెలంగాణ విశ్వవిద్యాలయ  విద్యార్థులు పాల్గొనడం గర్వకారణం అన్నారు. యూనివర్సిటీలో ఇలాంటి ప్రతిష్టాత్మక  ఒలంపిక్స్ అవేర్నెస్ రన్ కండక్ట్ చేయడం అభినందనీయమన్నారు. గ్రామీణ విశ్వవిద్యాలయాల నుండి  విద్యార్థులు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఒలంపిక్స్ స్థాయి వరకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ రన్ లో మొదటి స్థానంలో  ముగ్గురికి మెడల్స్ ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి, డాక్టర్ రమణ చారి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా డాక్టర్ బి.ఆర్ నేత, యూనివర్సిటీ విద్యార్థులు, జూనియర్ అసిస్టెంట్ నరేష్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Olympics Day Run at the University

More articles

Latest article