విశ్వవిద్యాలయంలో ఒలంపిక్స్ డే రన్
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : ప్రపంచ ఒలింపిక్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒలంపిక్స్ రన్ అర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుండి ప్రారంభమై యూనివర్సిటీ ప్లేగ్రౌండ్ వరకు కొనసాగించామని డైరెక్టర్ స్పోర్ట్స్ డాక్టర్ జి. బాలకిషన్ తెలిపారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రో. రవీందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డా. ప్రవీణ్ మామిడల మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఈవెంట్ ఒలంపిక్స్ అని అలాంటి ఒలంపిక్స్ రన్ తెలంగాణ విశ్వవిద్యాలయ విద్యార్థులు...