29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

కేంద్ర ప్రభుత్వం విత్తన చట్టాన్ని తీసుకురావాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ఎఐకెఎంఎస్ రాష్ట్ర నాయకులు ఆకుల పాపయ్య

 

నిజామాబాద్ సిటి, బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వం విత్తన చట్టాన్ని తీసుకరావాలని ఎఐకెఎంఎస్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్ కి  మెమోరండం సమర్పించారు. ఈ సందర్భంగా ఎఐకెఎంఎస్ రాష్ట్ర నాయకులు ఆకుల పాపయ్య మాట్లాడుతు జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనది రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. రైతుకు ఈ సీజన్ లో విత్తనం ముఖ్యమైనది ఈనాటికి ప్రభుత్వం మూడు శాతం విత్తనాలను మాత్రమే సప్లై చేస్తే ప్రైవేట్ విత్తన కంపెనీలే విత్తనాలను అందించే దాంట్లో పై చేయిగా ఉందన్నారు. వారిచ్చే విత్తనాలు నకిలీ విత్తనాల వల్ల రైతులు తీవ్ర నష్టాలకు గురై లక్షల  రూపాయలు నష్టపోతున్నారని  ప్రభుత్వం విత్తనం చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించాలి. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా రైతులకు సరిపడా విత్తనాలను నాణ్యమైన అందించాలని, ప్రభుత్వం తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థకు ఇవ్వాల్సిన 450 కోట్ల రూపాయలు అందించి ఆ సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని వారన్నారు. జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య మాట్లాడుతు రైతులకు ఈ సీజన్కు ప్రభుత్వం 18 రుణాలు అందించాలంటే కేవలం 12 శాతం కూడా రైతు బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వకపోవడంతో, వారు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని అన్నారు. అసలు బ్యాంకర్లు రైతులను అప్పు ఎగ్గొట్టే వారిగా నేరస్తులుగా చూస్తున్నారని, అన్నం పెట్టే రైతును అవమానించడం ఇది సరికాదన్నారు. కచ్చితంగా 18 శాతం రుణాలు అందించి వారికి అండగా ఉండాలని వారన్నారు. జిల్లాలో మూతపడిన చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. రైతులను మోసం చేస్తుందన్నారు. ఎన్ఎస్ఎఫ్ తో పాటు ఎన్సీఎస్ ఎఫ్ సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీ తెరిపించాలని, దాన్ని బెల్లం కేంద్రంగా మార్చి ప్రభుత్వమే నడిపించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  జిల్లా కార్యదర్శి డిశేటి సాయరెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు అగ్గు ఎరన్న, సాయిలు, దేవస్వామి,శ్రీనివాస్ రెడ్డి,దేవన్న,గోపాల్, కొట్టె గంగాధర్, బుచ్చన్న, సాయినాథ్, రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article