నిజాంసాగర్, బతుకమ్మ : నిజాంసాగర్ ప్రాజెక్ట్ సమీపంలో పేకాట ఆడుతున్న 9మందిని ఆదివారం అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ శివకుమార్ తెలిపారు. పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు దాడి చేసి వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.40,990నగదు, 7 సెల్ ఫోన్లు, ఒక తవేరా వాహనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
