నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ నిజామాబాద్ జిల్లా, ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఆదివారం నగరంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి ఎన్.నాగేందర్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి 30 మంది ఎగ్జిక్యూటివ్ సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో అసోసియేషన్ భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించారు. అసోసియేషన్ సభ్యులు ఎవరైనా చనిపోయినప్పుడు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తెలంగాణ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ నిజామాబాద్ జిల్లా తరపున రూ. 10వేల ఆర్థిక సహాయం అందించాలని కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర పెన్షనర్స్ జేఏసీ ఉపాధ్యక్షులు ముత్తారం నర్సింహ స్వామి పాల్గొని పెన్షనర్ల సమస్యలగురించి ప్రసంగించారు.
