28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆనంద జీవితానికి యోగా ఎంతో దోహదం 

Must read

📰 Generate e-Paper Clip

  • రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : ఆరోగ్యంగా ఆనందమైన జీవితాన్ని గడపడానికి యోగ ఎంతో  దోహదం  చేస్తుందని శారీరక దృఢత్వం, మానసిక స్థిరత్వం, ఆధ్యాత్మిక ఆనందం  కలుగుతుందని  ముఖ్యఅతిథి  రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి  తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్  ఆధ్వర్యంలో జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పేర్కొన్నారు.  ఈ సందర్భంగా రిజిస్ట్రార్  ప్రసంగిస్తూ ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప వరం   యోగా అన్నారు. విద్యార్థులు ఒత్తిడి ఆందోళనతో సతమతం కాకుండా  వారి దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలన్నారు. శాస్త్రీయంగా యోగాతో మానస్సు, శారీరం సమతుల్యత సాధిస్తుందన్నారు. ప్రధానంగా విద్యార్థి దశలో కలిగే ఒత్తిడిని యోగాతో నివారించుకొని ఉన్నతంగా ఎదగాలన్నారు. విశ్వవిద్యాలయ  విద్యార్థులందరూ  యోగాను ఒకరోజు కార్యక్రమంలో కాకుండా జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. ఆధునిక యుగంలో  యోగా అంటే శారీరక వ్యాయామం మాత్రమే కాదని అదొక  జీవన ప్రమాణమని, శాంతి,క్రమశిక్షణతో కూడిన జీవనానికి యోగా ఎంతో అవసరం అని పేర్కొన్నారు. భారతదేశంలో అనాదిగా పుట్టిన యోగ నేడు సరిహద్దులు, సంస్కృతులు, సాంప్రదాయాలను దాటి ఇప్పుడు విశ్వవ్యాప్తమైందని ఈ క్రమంలో నేడు అంతర్జాతీయంగా  200 దేశాలకు పైగా  ఈరోజు యోగా కార్యక్రమాలు నిర్వహించడంప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయంమన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త ఆచార్య కే రవీందర్ రెడ్డి గారు డైరెక్టర్ పి ఆర్ ఓ డా. ఏ. పున్నయ్య, డాక్టర్ మహేందర్ ఐలేని, ఫిజికల్ డైరెక్టర్ బిఆర్ నేత, సురేష్, రవీందర్ నాయక్, తదితర బోధన బోధ నేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు  పాల్గొన్నారు.

Yoga contributes greatly to a happy life

More articles

Latest article