ఆనంద జీవితానికి యోగా ఎంతో దోహదం
రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : ఆరోగ్యంగా ఆనందమైన జీవితాన్ని గడపడానికి యోగ ఎంతో దోహదం చేస్తుందని శారీరక దృఢత్వం, మానసిక స్థిరత్వం, ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుందని ముఖ్యఅతిథి రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ప్రసంగిస్తూ ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప వరం యోగా అన్నారు. విద్యార్థులు ఒత్తిడి ఆందోళనతో సతమతం కాకుండా వారి దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలన్నారు. శాస్త్రీయంగా యోగాతో...