27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎల్లారెడ్డి ఎప్ఆర్ఓ పై సస్పెన్షన్ వేటు

Must read

📰 Generate e-Paper Clip

 

 ఎల్లారెడ్డి , బతుకమ్మ:

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఫారేస్ట్ రేంజ్ ఆఫీసర్ ఓంకార్ ను సస్పెండ్ చేస్తు పిసిసిఎఫ్ సి. సువర్ణ ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్లారెడ్డి రెంజ్ పరిధిలో ఆటవి భూముల అన్యక్రాంతం కాకుండా అడ్డుకోవడంలో విఫలం కావడంతో వేటు వేసినట్లు తెలిసింది. ఓంకార్ బీట్ ఆఫిసర్ నుంచి ఎప్ఆర్ఓ వరకు అంచలంచేలుగా ఎదిగినప్పటికి ఎల్లారెడ్డి రెంజ్ లాంటి ప్రాంతంలో విధులు నిర్వహించడం కత్తిమీదా సాములాంటిది. కామారెడ్డి జిల్లాలో ఈ ఎడాధి అత్యధికంగా పోడు, ఆటవి భూముల అన్యాక్రాంతం అత్యథికంగా ఎల్లారెడ్డి రెంజ్ పరిధిలో జరుగడంతో ఆయనపై చర్యలు తీసుకుంటు శుక్రవారం ఆటవి శాఖా ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఓంకార్ స్థానంలో ఇప్పటి వరకు ఎవ్వరిని నియమించలేదు…

Yella Reddy  FRO suspended

More articles

Latest article