- ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్
భీమ్ గల్, బతుకమ్మ : మండలం లోని 27 గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రభలకుండా తగు చర్యలు తీసుకొని అంటూ రోగాలు నివారణకు కృషి చేయాలనీ ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఏ ఎన్ ఎం లు, ఆశ కార్యకర్తలు, ఐ సీ డీ ఎస్, ఐ కే పీ సిబ్బంది తో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామంల్లో పరిశుభ్రత కు ప్రాధాన్యత ఇవ్వాలని, అంటి లార్వా స్ప్రే, ఫోగింగ్ చేయాలనీ, ప్రతి శుక్రవారం డ్రై డే ఫ్రైడే నిర్వహించాలని ఆయన కోరారు. డెంగీ జ్వరాలు ప్రభలకుండా ఇంట్లో, పరసరాల్లో నిలువ ఉన్న నీటి నీ ఎప్పటికి అప్పుడు తొలగించాలని, డెంగ్యూ జ్వరం పరీక్ష యంత్రలు సబ్ సెంటర్, పీ హెచ్ సీ లలో అందుబాటులో ఉన్నందున ప్రజలు వినయోగించు కోవాలని కోరారు. కార్యక్రమం లో డీఏల్ పీ ఓ శివ కృష్ణ,మెడికల్ ఆఫీసర్ అజయ్,ఐ సీ డీ ఎస్ సూపర్వైజర్ శారద, ఎంపీవో శివచరణ్, ఆరోగ్య సిబ్బంది, కార్యదర్శులు, ఐ కే పీ, ఐ సీ డి ఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
