26.6 C
Hyderabad
Monday, August 3, 2026

చేంగల్ బైపాస్ బీటీ రోడ్డు పనులు ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ చెంగల్ గ్రామ ప్రజల ఇరువై యేండ్ల కల బైపాస్ రోడ్డు నిర్మాణం పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. రోడ్డు పనుల నిర్మాణంలో భాగంగా బ్లెడ్ ట్రాక్టర్లతో రోడ్డును చదును చేశారు. ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం పనుల మంజూరికి కృషి చేసిన బాల్కొండ కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. రోడ్డు పనులకు నిధులు మంజూరు చేసిన మంత్రులకు, సాంక్షన్ సాంకేతిక సహకారం అందించిన మండల, జిల్లా అధికారులకు గ్రామస్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోడ్డు పనులు ప్రారంభం కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ నర్సపూరం, మండల పార్టీ ట్రెజరర్ దుమల రాజు, గ్రామ శాఖ అధ్యక్షులు నూతుల రమేష్, యూత్ ప్రెసిడెంట్ ఆర్మూర్ రవి, సీనియర్ నాయకుడు వసంతరెడ్డి, నాయకులు అడప రాజేశ్వర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

More articles

Latest article