24.1 C
Hyderabad
Monday, August 3, 2026

రైడ్స్ ఆధ్వర్యంలో విద్యార్ధికి ఆర్థిక సహాయం

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్  పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు సువెని, విజయశ్రీ, అభిరాజులు ఈనెల 14వ తేదీన హైదరాబాద్ లోని యకత్పురా లో జరిగిన అండర్ 15 రెజ్లింగ్ పోటీలో సువెని గోల్డ్ మెడల్, అభిరాజ్ సిల్వర్ మెడల్, విజయశ్రీ  బ్రోనజ్ మెడల్ సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కట్ట శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం రైడ్స్ సంస్థ అధ్యక్షులు కృష్ణ ప్రసాద్,  సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈనెల 21వ తేదీన పూణేలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి రెజ్లింగ్ పోటీలకు గోల్డ్ మెడల్ సాధించిన సువేణికి రైడ్స్ సంస్థ వారు ప్రయాణ ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహకారం అందించి అభినందనలు తెలిపారు.

More articles

Latest article