27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నుండి నీటి విడుదల

Must read

📰 Generate e-Paper Clip

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

బతుకమ్మ, బోధన్‌

నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు బుధవారం తెలిపారు. ఈ నీరు ప్రధాన కాలువ ద్వారా బోధన్‌ బేలాల్‌ చెరువు నుంచి అలీసాగర్‌ చెరువులోకి చేరుకోనుంది. ఈ నేపథ్యంలో కాలువ పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలవనరుల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని, కాలువల ఆనకట్టలు, వంతెనలు, మరియు లోతట్టు ప్రాంతాలలో ఉండే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేకించి పిల్లలు, వృద్ధులు గొర్రె కాపరులు కాలువల సమీపానికి వెళ్లొద్దని కోరారు.

More articles

Latest article