నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నుండి నీటి విడుదల

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన బతుకమ్మ, బోధన్‌ నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు బుధవారం తెలిపారు. ఈ నీరు ప్రధాన కాలువ ద్వారా బోధన్‌ బేలాల్‌ చెరువు నుంచి అలీసాగర్‌ చెరువులోకి చేరుకోనుంది. ఈ నేపథ్యంలో కాలువ పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలవనరుల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని, కాలువల ఆనకట్టలు, వంతెనలు, మరియు లోతట్టు ప్రాంతాలలో ఉండే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేకించి పిల్లలు,...