30.9 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రజా వ్యతిరేక ప్రభుత్వ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి

Must read

📰 Generate e-Paper Clip

  • మండల బీజేపీ ప్రెసిడెంట్ ఆరె రవీందర్

 

భీమ్ గల్, బతుకమ్మ : గత ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు కోసం అలివి సాధ్యం కానీ హామీలనిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక పాలనను సాగిస్తోందని, అట్టి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భీమ్ గల్ మండల బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ ఆరె రవీందర్ అన్నారు. పార్టీ అధిష్టానం సూచన, కానిస్టెన్సీ పార్టీ ఇంచార్జ్ డాక్టర్. మల్లికార్జున్ రెడ్డి ఆదేశానుసారంను మండలంలోని బాచన్ పల్లి గ్రామంలో నిర్వహించిన గ్యారాసాల్ అమృతకాల్ అభియాన్ సంకల్ప సభ కార్యక్రమం ను నిర్వహించారు. ఈ సందర్బంగా రవీందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, 420 హామీలను ప్రజలకు ఇచ్చి వారి నట్టేట ముంచిందన్నారు. మోసపూరిత కాంగ్రెస్ పాలనను ఎండగట్టి, ప్రజల్లో బీజేపీ కేంద్రంలో చేసిన పనులను వివరించి, పార్టీని మరింత బలోపేతం చెయ్యాలన్నారు.ఈ సమావేశంలో మండల ఉపాధ్యక్షులు భుఖ్య మోహన్,ప్రధాన కార్యదర్శి బిర్రు రామకృష్ణ, కార్యదర్శులు జి.రాజేష్,రజనీకాంత్, బద్ది సంజయ్, సీనియర్ నాయకులు మూడేడ్ల దేవిదాస్ శెట్టి లక్ష్మణ్,సిహెచ్ రాజేశ్వర్,  మరియు మండల బీజే,వై,ఎం నాయకులు శెట్టి ప్రేమ్చంద్ కొట్టాల అశోక్,నవతేజ్, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ప్రముఖులు ప్రబారీలు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

The anti-people government should be brought to the people.

More articles

Latest article