- రుద్రూర్ ఎస్సై సాయన్న
రుద్రూర్, బతుకమ్మ: మాదకద్రవ్యాలతో యువత జీవితాలు నాశనం చేసుకోవద్దని రుద్రూర్ ఎస్సై సాయన్న సూచించారు. సోమవారం రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణం వద్ద మాదకద్రవ్యాల నిర్మూలనకై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ, సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సాయన్న, మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగంతో యువత జీవితం నాశనం అవుతుందని, వాటి బారిన పడవద్దన్నారు. మాదక ద్రవ్యాల వినియోగంపై పోలీస్ శాఖకు సమాచారం అందించాలని, పోలీస్ శాఖ దీనిపై నిఘా ఉంచిందన్నారు. ఎవరైనా గంజాయి సేవిస్తున్నట్లు గాని, సరఫరా చేస్తున్నట్లు గాని సమాచారం ఉంటే డయల్ 100 కు లేక డ్రగ్స్ కు సంబంధించిన సమాచారం టోల్ ఫ్రీ నెంబర్1908 చేయాలని కోరారు. డ్రగ్స్ అనేది భయంకరమైన అలవాటని బానిసలు కావద్దని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ రాజు, హెడ్ కానిస్టేబుల్ సురేష్, కానిస్టేబుల్ లు, ఏఎన్ఎం గౌరీ, ఆశా వర్కర్లు లత, ప్రేమల, నిర్మల, ప్రధానోపాధ్యాయులు, ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
