మాదకద్రవ్యాలతో జీవితాలు నాశనం చేసుకోవద్దు
రుద్రూర్ ఎస్సై సాయన్న రుద్రూర్, బతుకమ్మ: మాదకద్రవ్యాలతో యువత జీవితాలు నాశనం చేసుకోవద్దని రుద్రూర్ ఎస్సై సాయన్న సూచించారు. సోమవారం రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణం వద్ద మాదకద్రవ్యాల నిర్మూలనకై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ, సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సాయన్న, మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగంతో యువత జీవితం నాశనం అవుతుందని, వాటి బారిన పడవద్దన్నారు. మాదక ద్రవ్యాల వినియోగంపై పోలీస్ శాఖకు సమాచారం అందించాలని, పోలీస్ శాఖ దీనిపై నిఘా ఉంచిందన్నారు. ఎవరైనా గంజాయి సేవిస్తున్నట్లు...