- ఇంటర్ సప్లిమెంటరీ లో 57.46శాతం ఉత్తీర్ణత
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో 2024 – 25 విద్యాసంవత్సరానికి గాను గత మే నెలలో జరిగిన సప్లమెంటరీ పరీక్షలలో జిల్లాలో 57.46% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్ తెలిపారు. జనరల్ సెకండియర్ లో మొత్తం 6,497 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 3,733 మంది విద్యార్థులు పాస్ అయి 57.46% ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. వోకేషనల్ సెకండియర్ లో మొత్తం 899 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 503 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని మొత్తం 55% మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు 10,098 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 5,851 మంది విద్యార్థులు పాస్అయ్యారని, 58% ఉత్తీర్ణత సాధించారని జిల్లా ఇంటర్ విద్య అధికారి తెలియజేశారు. అలాగే ఒకేషనల్ మొదటి సంవత్సరంలో 1,420 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 903 మంది విద్యార్థులు పాసై 63.59% ఉత్తీర్ణత సాధించారని జిల్లా ఇంటర్ విద్య అధికారి తెలియజేశారు. రాష్ట్ర మొత్తం మీద రెండవ సంవత్సరంలో ఉత్తీర్ణత శాతం 20వ స్థానంలో ఉండగా, మొదటి సంవత్సరం ఉత్తీర్ణత శాతం 26వ స్థానంలో ఉందని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్ తెలియజేశారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ జవాబు పత్రాలను రీవాల్యుయేషన్, వెరీ వెరిఫికేషన్ చేసుకోవాలనుకునే వారు ఈనెల 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఇంటర్ విద్య అధికారి తెలిపారు.
