28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

రాజీ పద్ధతిన సత్వర న్యాయం

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరత లక్ష్మీ

 

నిజామాబాద్, బతుకమ్మ : దీర్ఘాకాలం న్యాయ వివాదాలను కొనసాగించుకోవడం వలన ఎవరికి లాభం, ఎవరికి ఉపయోగమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ జి. వి. ఎన్ భరత లక్ష్మీ అన్నారు. జిల్లాకోర్టు ప్రాంగాణంలోని న్యాయసేవ సదన్ లో శనివారం జాతీయ లోక్ అదాలత్ ను అదనపు జిల్లాజడ్జి కనక దుర్గ, హరీష,బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్ రెడ్డి, బార్ అధ్యక్షుడు సాయరెడ్డి, న్యాయసేవ సంస్థ కార్యదర్శి ఉదయ్ భాస్కర్ రావు, అదనపు పోలీస్ కమిషనర్ బస్వారెడ్డి లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన అనంతరం ఆమె కక్షిదారులు, న్యాయవాదులు, న్యాయ సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు.కోర్టులలో విచారణలో ఉన్న కేసులు పరిష్కారానికి సమయం పడుతుంది కాని కక్షిదారులు రాజీ పద్ధతిన పరిష్కరించుకోవడం వలన సత్వర న్యాయానికి వీలు ఉన్నదనని తెలిపారు. దీర్ఘకాలికంగా న్యాయ వివాదాలు కొనసాగించుకోవడమంటే జీవితకాలాన్ని పోగొట్టుకోవడమేనని పేర్కొన్నారు. లోక్ అదాలత్ లోకేసులను రాజీ చేసుకోమని బలవంతం చేయరాదని, ఇష్టపూర్వకంగా రాజీ చేసుకోవడానికి సంస్థ సిద్ధమని ఆమె తెలిపారు.అన్ని రకాల సివిల్ దావాలు లోక్ అదాలత్ లో రాజీకి అవకాశం ఉన్నదని అన్నారు. రాజీ పడదగిన క్రిమినల్ కేసులలో మాత్రమే రాజీకి అవకాశం ఉన్నదని, మర్డర్, రేప్, హత్యయత్నం లాంటి కేసులు రాజీకి వీలు లేవని అన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ హాజరు కాకపోవడం రూల్స్ అతిక్రమనేనని అన్నారు. న్యాయవాదుల సహకారం సంపూర్ణoగా లభిస్తోందని తెలిపారు. పోలీస్, రేవిన్యూ శాఖల మద్దత్తు మరువలేనిదని అన్నారు. అందరి ప్రోత్సాహంతో అడుగులు ముందుకు వేస్తు న్యాయసేవ సంస్థ తన ప్రస్థానాన్ని కొనసాగుస్తున్నదని, భవిష్యత్ కాలపు కార్యాచరణలో మరింత పౌరసమాజ సహకారన్ని జిల్లాజడ్జి భరత లక్షి ఆశించారు. అదనపు జిల్లాజడ్జి కనక దుర్గ ప్రసంగిస్తు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజ ప్రగతికి ఉపయోగించాలే కాని విచ్చినానికి కాదని తెలిపారు.హత్య కేసులలో తల్లితండ్రులను పోగొట్టుకున్న పిల్లల జీవన, విద్య,ఆర్థిక భవిష్యత్ కు చట్టం రక్షణ కవచంలా నిలుస్తున్నదని తెలుపుతు, బాధితులు న్యాయసేవ సంస్థ ను ఆశ్రయించి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని ఆమె తెలిపారు.తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు మంథని రాజేందర్ రెడ్డి మాట్లాడుతు నేటి లోక్ అదాలత్ లో తాను భాగస్వామ్యమవుతు  ఇరు పక్షాలను రాజీమార్గం వైపు నడిపిస్తు సామాజిక మార్పు దిశగా కొన్ని క్రిమినల్ కేసులకు శాశ్వత పరిష్కారం చూపినట్లు తెపిపారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి ప్రసంగిస్తు న్యాయసేవ సంస్థ ప్రతి కార్యక్రమానికి చేదోడుగా నిలుస్తున్నామని అన్నారు. నిజామాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ బస్వారెడ్డి మాట్లాడుతూ క్రిమినల్ కేసులలోని బాధితుల నుండి ఇబ్బందులు ఎదురవుతున్న, లోక్ అదాలత్ అనే మహా కార్యక్రమంలో పాలుపంచుకుంటు శాంతియుత సమాజ నిర్మాణంలో పాత్రదారులం అవుతున్నామని అన్నారు.జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు సంస్థ లక్ష్యాలు, కార్యక్రమాల పురోగతిని వివరించారు.కార్యక్రమంలో అదనపు జిల్లాజడ్జి హరీష, సీనియర్ సివిల్ జడ్జి సాయిసుధ, జూనియర్ సివిల్ జడ్జిలు గోపికృష్ణ, ఖుష్భూ ఉపాధ్యాయ్, శ్రీనివాస్ రావు, హరి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

  • 90 లక్షల బ్యాంక్ చెక్ అందజేత…

నిజామాబాద్ జిల్లాకోర్టులో న్యాయ విచారణ దశలో ఉన్న మోటారు రోడ్డు ప్రమాద నష్ట పరిహార దావా ను చోళ మండల జనరల్ భీమా కంపెనీ స్టాండింగ్ కౌన్సిల్ నేమురి సధానంద్ గౌడ్,మృతుడు బాదావత్ ప్రేమదాస్ భార్య, పిల్లలు, తల్లిని రాజీ పద్ధతిన ఒప్పించి కోటి ఇరవై ఐదు లక్షల దావాను 90లక్షలకుగాను అవార్డు ను జిల్లాజడ్జి బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్బంగా జిల్లాజడ్జి భరత లక్మి మాట్లాడుతూ బాధితకుటుంబం ఆర్థిక స్వాలాంబనకు చేదోడుగా నిలుస్తుందని అన్నారు.రోడ్డు ప్రమాదంలో మరణించిన మనిషిని తీసుకురాలేక పోయిన మని మానవ మనుగడకు ఉపయోగ పడగలదని ఆమె పేర్కొన్నారు.

Speedy justice through compromise

More articles

Latest article