27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ బతుకమ్మ :

తాగునీటి సమస్యను పరిష్కరించాలని మహిళలు రోడ్డెక్కారు. మహమ్మద్‌ నగర్‌ మండల కేంద్రంలోని బుడగ జంగాల కాలనీ ప్రజలు గత వారం రోజులుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తాగునీటి సమస్యను పరిష్కరించాలని మహిళలు శనివారం బోధన్‌-హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో బైఠాయించారు. ఈ నిరసనతో ఇరువైపులా పెద్దఎత్తున వాహనాలు నిలిచి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిరది. సమాచారం అందుకున్న ఎస్సై శివకుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకొని మహిళలను సముదాయించారు. పంచాయతీ అధికారులతో మాట్లాడి తాగునీటి ఇబ్బందులు లేకుండా చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.

More articles

Latest article