గోపా జిల్లా శాఖ తరపున అందజేత
నిజామాబాద్, బతుకమ్మ : పదో తరగతి, ఇంటర్ పరీక్షలలో ఉత్తమ మార్కులు సాధించిన గౌడ విద్యార్థులకు గోపా జిల్లా శాఖ తరపున ప్రతిభ పురస్కారాలు అందజేయనున్నట్లు జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 15న నిజామాబాద్ లోని అంబేడ్కర్ భవన్ లో ఉదయం 11 గంటలకు పదోతరగతి లో 500 మార్కుల పై బడిన వారికి, ఇంటర్ లో 900 మార్కుల పైన సాధించిన విద్యార్థులు తమ పేర్లను ఈ క్రింది వారికి ప్రత్యక్షంగా లేదా వాట్సాప్ ద్వారా విద్యార్థుల మార్కుల మెమో, ఆధార్ కార్డ్, జిరాక్స్ కాపీ లను అందజేయలన్నారు.నిజామాబాద్ లో ఎం. వెంకటేశ్వర్ గౌడ్ (9440768910) కి, రవీందర్ గౌడ్ (9866413250)కి, టి. సోమలింగం గౌడ్ (9440502363)కి, హెచ్. లక్ష్మణ్ గౌడ్ (8341631163) కి ఆర్మూర్ లో లింభా గౌడ్ టీచర్ (9491313699), రాజేశ్వర్ గౌడ్ (9912469820)కి వాళ్ల పేర్లు జిరాక్స్ కాపీ లను అందించాలన్నారు. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, గోపా రాష్ట్ర అధ్యక్షులు బండి సాయన్న, ప్రదాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ఉపాద్యక్షులు మరయ్య గౌడ్, చక్రవర్తి గౌడ్ లు హాజరువుతారన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
