బతుకమ్మ, వెబ్ డెస్క్
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారనే కేసులో ఇప్పటికే రెండుసార్లు ఆయనను సిట్ సుదీర్ఘంగా విచారించింది. ఈ క్రమంలో మరోసారి విచారణకు రావాల్సిందిగా సిట్ నోటీసులు పంపగా.. మూడోసారి సిట్ ఎదుట విచారణకు ప్రభాకర్ రావు హాజరయ్యారు.
