మరోసారి సిట్‌ ముందుకు ప్రభాకర్‌ రావు

బతుకమ్మ, వెబ్‌ డెస్క్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు సిట్‌ విచారణకు హాజరయ్యారు. ప్రముఖుల ఫోన్లు ట్యాప్‌ చేశారనే కేసులో ఇప్పటికే రెండుసార్లు ఆయనను సిట్‌ సుదీర్ఘంగా విచారించింది. ఈ క్రమంలో మరోసారి విచారణకు రావాల్సిందిగా సిట్‌ నోటీసులు పంపగా.. మూడోసారి సిట్‌ ఎదుట విచారణకు ప్రభాకర్‌ రావు హాజరయ్యారు.