27.3 C
Hyderabad
Friday, July 31, 2026

ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి

Must read

  • ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయాలి
  • ఎమ్మెల్యేకు పీడీఎస్యూ వినతి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఆధ్వర్యంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి కంటేశ్వర్ బైపాస్ రోడ్ లో గల ఎమ్మెల్యే కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నర్సరీ నుంచి ఇంటర్ వరకు ప్రైవేట్ విద్యా సంస్థలు లక్షలాది రూపాయలు ఫీజులు పెట్టి విద్యార్థుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారని , బుక్స్ యూనిఫామ్, షూ,ల్యాబ్,ఈవెంట్స్, సైన్స్ ఫెయిర్ రకరకాల పేర్లతో ఫీజుల దోపిడీ చేస్తున్నారని అన్నారు. వీటిని నియంత్రించడానికి ఫీజుల నియంత్రణ చట్టం రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని ,వచ్చే అసెంబ్లీ సమావేశాలలో  రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని అన్నారు. ఫీజుల నియంత్రణపై అధ్యయనం చేసిన తెలంగాణ విద్యా కమిషన్ “తెలంగాణ ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ స్కూలు రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ముసాయిదా బిల్లు 2025 ” పేరిట జనవరి 24 రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. అదేవిధంగా పేద విద్యార్థులు చదువుకునే ఇంటర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని కోరారు. మీరిచ్చిన జెన్యూన్ డిమాండ్స్ ను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ జిల్లా నాయకులు మనోజ్ , నగర నాయకులు సాయికిరణ్,రాజు,చరణ్ తేజ,రెడ్డి,వంశీ, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Fee regulation law should be brought in.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article